గడువులోగా హియరింగ్ పూర్తి చేయాలి

07-10-2026 | 10:26pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణలో హియరింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పరిశీలకులు డా. యోగితారాణా(Dr. Yogita Rana) సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 90.3 శాతం హియరింగ్ పూర్తయిందని, ఇంకా 10,309 మంది ఓటర్ల హియరింగ్ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ప్రక్రియ పూర్తికి రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని కోరారు. ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు.

మరిన్ని వార్తలు