బస్వాపూర్‌లో మహిళ అదృశ్యం..

07-10-2026 | 10:58pm

భిక్కనూర్, అక్టోబర్‌ 7 (విజయక్రాంతి): భిక్కనూర్‌(Bikkanoor) మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన కళ్ళ లక్ష్మి (42) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ అనిల్‌ తెలిపారు. అక్టోబర్‌ 6న ఉదయం 11 గంటలకు పని మీద బయటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి కాలినడకన వెళ్లిన ఆమె సాయంత్రం వరకు తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదన్నారు. ఆమె బీడీలు చేస్తుంటారని, ఎత్తు సుమారు ఐదు అడుగులు, తెలుపు ఛాయ ఉంటుందని తెలిపారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు గోధుమ రంగు చీర, నారింజ రంగు జాకెట్‌ ధరించినట్లు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు 8712686154, 8712666235 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.

మరిన్ని వార్తలు