పోరాట యోధుడికి ఘన నివాళి!

30-10-2026 | 11:04am

ములకలపల్లి (విజయక్రాంతి): సీపీఎం సీనియర్ నాయకుడు బైరు వెంకటేశ్వర్లు ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు పిలుపునిచ్చారు. గురువారం ములకలపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బైరు వెంకటేశ్వర్లు ఆరో వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు.

మండలంలో తొలితరం కమ్యూనిస్టు యువకుడిగా పార్టీలో చేరిన వెంకటేశ్వర్లు, చివరివరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. సొసైటీ డైరెక్టర్‌గా రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం రైతాంగ పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు.

రైతుల కోసం ఆయన చేసిన సేవలు, పోరాటాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. వెంకటేశ్వర్లు ఆశయాల సాధనకు ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపగాని లక్ష్మి నరసయ్య, బైరు ప్రసాద్, గడ్డం వెంకటేశ్వర్లు, కాంతారావు, గంగరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు