ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల పెంపు

12-11-2026 | 03:06pm
  1. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి
  2. డీఎల్పీఓ సుధీర్ కుమార్ 

బూర్గంపాడు,(విజయక్రాంతి): వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను(Groundwater) పెంపొందించేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని డీఎల్పీఓ సుధీర్‌కుమార్‌(DLPO Sudheer Kumar) సూచించారు. గురువారం బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్‌ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలమట్టం పెరుగుతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంకుడు గుంతలు నిర్మించుకుని, గ్రామపంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ రామకృష్ణ, సర్పంచి బానోత్‌ పద్మ, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు