అంగన్వాడీ ఆయా పోస్ట్ స్థానికులకు కేటాయించాలి

07-10-2026 | 06:19pm

ములకలపల్లి అక్టోబర్ 7 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం కాపు గంగారం గ్రామంలో ఉన్న అంగన్వాడి ఆయా పోస్టు ఎంపికలో(Selection for the Anganwadi Ayah post) ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకతతో ఎంపిక జరగాలని గ్రామస్తులు కోరారు.కాపు గంగారం గ్రామ గిరిజనులు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.

గత మూడు రోజులుగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ,ఐసిడిఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి సరికాదని తెలియజేస్తూ గతంలో టీచర్ పోస్ట్ ఎంపికలో స్థానికులను కాదని వేరే గ్రామస్తులకు టీచర్ పోస్టు ఇచ్చారని మళ్లీ మా గ్రామస్తులను కాదని వేరే గ్రామానికి చెందిన వారిని నియమించి మా గ్రామానికి అన్యాయం చేయాలని చూస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వర్ష శ్రీరాములు,గీగ రాఘవులు,వర్ష లక్ష్మి,సోడే జయమ్మ, పొట్ట లక్ష్మి, ఊకే భద్రమ్మ, వర్ష రాజమ్మ, గీగ మంగ, మడకం భద్రమ్మ, పొట్ట లక్ష్మి పొడియం భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు