కేసీఆర్ త్యాగాలను భావితరాలకు చాటడమే దీక్షా దివస్ లక్ష్యం

29-11-2026 | 06:29pm

టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

కొల్లాపూర్ నవంబర్ 29: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని  కోడేరు మండల కేంద్రంలోని 2009న తెలంగాణ సాధన కోసం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao).(కేసీఆర్)(KCR) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ  బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి(Beeram Harshavardhan Reddy) పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులు, విద్యార్థుల ఆందోళనలు, రైల్ రోకోలు, హైవే దిగ్బంధనాలు, ఆర్టీసీ బస్సుల నియంత్రణ, డిపోల మూసివేత వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అయితే  తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్  చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోయిందన్నారు.

కేసీఆర్ చేపట్టిన దీక్ష సుమారు పది రోజుల పాటు కొనసాగడంతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, అప్పటి కేంద్ర హోంమంత్రి శ్రీ పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేయడంతో కేసీఆర్  దీక్షను విరమించారని గుర్తు చేశారు. 2009లో జరిగిన ఈ చారిత్రాత్మక ఘటనకు దాదాపు 17 సంవత్సరాలు పూర్తయ్యాయని,అప్పట్లో పుట్టిన నేటి యువత, ప్రస్తుతం ఓటు హక్కు పొందిన తరం తెలంగాణ ఉద్యమ చరిత్రను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి మహనీయుల పోరాటాలను పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నట్లుగానే, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్ర కూడా ఎంతో గొప్పదని అన్నారు

. కేసీఆర్  చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలక మలుపుగా నిలిచాయని, ఈ చారిత్రాత్మక విషయాలను నేటి యువతకు, ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం  కోడేరు పోలీస్ స్టేషన్ వెళ్లి తీగలపల్లి టిఆర్ఎస్ గ్రామ అధ్యకుడు భాస్కర్ రెడ్డి.  దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని. బాధితునికి న్యాయం చేయాలని. డీఎస్పీ బుర్ర శ్రీనివాసులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. 

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రఘునందన్ రెడ్డి. పెంట్లవెల్లి సర్పంచ్ మారుపాకుల చిట్టెమ్మ. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వారితో పాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు