ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ సీటు సాధించిన మన్యం బిడ్డ!

27-11-2026 | 11:39pm

- ఎం.కాం కోర్సులో ప్రవేశం పొందిన గిరిజన విద్యార్థిని

- అభినందించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు

గుండాల, నవంబర్ 27 (విజయక్రాంతి): మండల పరిధిలోని దామరతోగు గ్రామానికి(Damaratogu village) చెందిన కుంజా నాగేశ్వర రావు - లలిత(Kunja Nageswara Rao - Lalitha) దంపతుల కుమార్తె కుంజా శాలిని(K. Shalini) హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో(Osmania University Campus) పీజీ (ఎం.కాం) కోర్సులో సీటు సాధించి తన ప్రతిభను చాటుకుంది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన శాలిని అంగన్వాడీ(Anganwadi), ఎల్కేజీ నుండి తల్లిదండ్రుల కృషి మరియు తన పట్టుదలతో ప్రాథమిక పాఠశాల(Primary school) నుండి నవోదయ, గురుకులాలలో సీటు సాధించుకుంటూ డిగ్రీ వరకూ చదివి తెలంగాణ ఉన్నత విద్యాలయం అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశం పొందడం అభినందనీయమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఆమె సాధించిన విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం కష్టపడి చదివితే ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశాలు సాధించవచ్చని శాలిని విజయం నిరూపిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శాలిని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు