జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలకు పెంచాలి

28-11-2026 | 12:06am

- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

జన్నారం (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) జన్నారం మండల కేంద్రంలోని PHC నీ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా(Government Hospital) అప్ గ్రేడ్ చేయాలని, మెరుగైన వైద్య సేవలు(Medical Services) అందించేందుకు అవసరమైన వైద్య పరికరాలు మంజూరు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Bojju Patel) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహను(Damodara Raja Narasimha), ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తును కలిసి వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి(Jannaram Government Hospital) అవసరమైన వైద్య పరికరాలను మంజూరు చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆసుపత్రిని మరింత బలోపేతం చేయడం ద్వారా మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు