వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల మెరుపు దాడులు

27-11-2026 | 11:32pm

57 మందికి చెందిన ఇళ్లలో తనిఖీలు..

16 కేసులు నమోదు

ఆసిఫాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): జిల్లాలో అధిక వడ్డీ, అక్రమ చిట్టీ వ్యాపారులపై(High interest, illegal chit traders) పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్(District SP Nitika Pant), ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్(Kagaznagar DSP Wahiduddin) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 57 మంది వడ్డీ, చిట్టీ వ్యాపారుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 16 కేసులు నమోదు చేసి, 102 ప్రామిసరీ నోట్లు, 63 ఖాళీ చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.అధిక వడ్డీల పేరుతో రైతులు, అమాయక ప్రజలను వేధించినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. బాధితులు భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు