మఠంపల్లిలో కొత్తగా పశువుల సంత

27-11-2026 | 11:29pm

మఠంపల్లి నవంబర్ 27 (విజయ క్రాంతి) : హుజూర్‌నగర్ మార్కెట్(హుజూర్‌నగర్ మార్కెట్) పరిధిలోని మఠంపల్లి సబ్ మార్కెట్ యార్డులో(Mathampally Sub-Market Yard) డిసెంబర్ 3న పశువుల సంత(Cattle Market) ప్రారంభం కానుంది. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో రైతుల సౌకర్యార్థం దీనిని ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్‌కుమార్, కార్యదర్శి నరసింహ వెల్లడించారు. ప్రతి బుధవారం సంత కొనసాగుతుంది.2 రాష్ట్రాల రైతులకు అనువుగా విశాలమైన ప్రాంగణం, తాగునీరు, రైతులకు ఉచిత అల్పాహారం అందిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు