బొల్లారంలో మహిళ అదృష్టం

27-11-2026 | 11:59pm

జిన్నారం, నవంబర్ 27 : బొల్లారం గ్రామం(Bollaram Village) కేబీఆర్ కాలనీకి చెందిన మానసిక దివ్యాంగురాలు చంద్రకళ(Mentally disabled Chandrakala) (33) ఈ నెల 24వ తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిందని ఐడీఏ బొల్లారం పోలీసులు(IDA Bollaram Police) తెలిపారు.కలాల్ సావిత్రికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రకళ పుట్టుకతోనే మానసిక దివ్యాంగురాలు. తల్లితో కలిసి నివసిస్తోంది. 24న సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.చంద్రకళ ఎత్తు 5.3 అడుగులు, ఛాయ నలుపు-గోధుమ రంగు. కనిపించే సమయంలో ఎరుపు రంగు నైట్ డ్రెస్ ధరించింది.ఈ మహిళ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఎస్హెచ్ఓ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు