ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి చదరంగం పోటీలు

27-11-2026 | 11:50pm

కొడిమ్యాల, నవంబర్ 27 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School) ఈనెల 28 న 70 వ ఎస్జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి చదరంగం పోటీలు(Karimnagar District-Level Chess Tournaments) నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు, అధికారులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు  సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి తెలిపారు. చదరంగం పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కె.ప్రణీత శుక్రవారం పరిశీలించారు. పూర్తి వివరాలకు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజ మల్లయ్య చరవాణి నంబర్  9441431287 ను సంప్రదించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు