భద్రాచలంలో ర్యాపిడో సేవలు ప్రారంభం

27-11-2026 | 11:41pm

స్థానిక యువతకు పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉపాధి అవకాశాలు

భద్రాచలం, (విజయక్రాంతి) : భద్రాచలం పట్టణంలో(Bhadrachalam town) ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ర్యాపిడో(Mobility platform Rapido) (Rapido) తన Bike, Auto, Cab సేవలను శుక్రవారం ప్రారంభించింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ వెంకట్రావు(MLA Venkatrao) ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాపిడో సేవలను(Rapido services) అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు గారు మాట్లాడుతూ, భద్రాచలం ప్రజలకు ఆధునిక రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యంగా స్థానిక యువతకు పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ర్యాపిడో వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

విద్యార్థులు తమ చదువుతో పాటు ఖాళీ సమయంలో పనిచేసి ఆదాయం పొందవచ్చని, నిరుద్యోగ యువత పూర్తి సమయం పనిచేసే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. సొంత వాహనాలు కలిగిన అర్హులైన వ్యక్తులు కూడా తమకు అనుకూలమైన సమయంలో ఈ సేవల్లో భాగస్వాములు కావచ్చని పేర్కొన్నారు.

ప్రస్తుతం భద్రాచలంలో సుమారు 100 మంది కెప్టెన్లు ర్యాపిడోతో అనుసంధానమై ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింతమంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.భద్రాచలం ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కావడంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, భక్తులు మరియు పర్యాటకులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంలో ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.

ఈ కార్యక్రమంలో  ర్యాపిడో క్లస్టర్ మేనేజర్ మణికంఠ, భద్రాచలం మేనేజర్ సాయికృష్ణ , కరీంనగర్ మేనేజర్ జాహిద్, మరియు ఇంచార్జి ఫణి, శశికుమార్, రాజ్ కుమార్, ప్రశాంత్ ర్యాపిడో ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు,  పాల్గొన్నారు.

ర్యాపిడో సేవల ప్రారంభంతో భద్రాచలంలో డిజిటల్ రవాణా సదుపాయాలు మరింత విస్తరించడంతో పాటు స్థానిక యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు