కళా నృత్య ప్రదర్శనలతో టీఏజీఎస్ మహాసభలు ప్రారంభం!

27-11-2026 | 11:34pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షాభూమిలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(Telangana Adivasi Tribal Association) నాలుగో రాష్ట్ర మహాసభలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే మహాసభల ప్రారంభోత్సవంలో ఆదివాసీ తెగల కళాకారులు తమ సంస్కృతి, సంప్రదాయాలను(Culture and traditions) ప్రతిబింబించేలా ఎత్మాసూర్ కళా నృత్య ప్రదర్శనలు(Ethmasur Art and Dance Performances) నిర్వహించారు. శనివారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ అనంతరం లుంబిని దీక్షాభూమిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ మీడియం బాపూరావు అధ్యక్షత వహించనుండగా, ముఖ్య అతిథిగా ఆదివాసీ అధికార రాష్ట్రీయ యువ మంచ్ జాతీయ వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బృందా కారత్ హాజరుకానున్నారు. ఆదివారం ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండారి రవికుమార్, భూపాల్, జిల్లా నాయకులు రాజన్న, దుర్గం దినకర్, రాజేందర్, కృష్ణమాచారి, కార్తీక్, టీకానంద్, మాలశ్రీ, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు