అయ్యవారిపల్లి గ్రామసభలో అవినీతి ఆరోపణలపై దుమారం!
మిడ్జిల్, నవంబర్ 27: మండల పరిధిలోని అయ్యావారిపల్లి గ్రామంలో(Ayyavaripalli Village) ఈరోజు నిర్వహించిన గ్రామసభలో 2019–2023 మధ్య గత పాలకుల హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి, నిధుల దుర్వినియోగం(Corruption, misuse of funds) అంశాలపై చర్చ జరిగింది. గ్రామపంచాయతీ నిధుల ఖర్చులు(Expenditure of Gram Panchayat Funds), అభివృద్ధి పనుల వివరాలపై గ్రామస్తులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు మాజీ సర్పంచ్ నుంచి స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో చర్చ కొలిక్కి రాలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాజశేఖర్ రెడ్డి, జిపిఓ ప్రీతి, గ్రామ సర్పంచ్ వెంకట రాములు, మాజీ సర్పంచ్, నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకాంత్, చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు