అంధకారంలో గిరిజన వసతి గృహం

28-11-2026 | 10:24pm

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన బాలుర ఆశ్రమ వసతి గృహంలో(Kinnerasani Tribal Boys Hostel) అంధకారం తాండవిస్తోంది. గత రెండు రోజులు విద్యుత్ సమస్య(Electricity problem) తలెత్తుతున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హాస్టల్ గదుల్లో అంధకారం తాండవిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

అసలే చలికాలం, ఆపైన విషపు క్రిమి కీటగాదులు సంచరించే ప్రాంతంలో అంధకారం తాండవిస్తున్న విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో హాస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గదుల్లో నిద్రించలేక ఆరుబయట నేల మీద విద్యార్థులు పడుకోవడం సోషనీయం. అధికారుల నిర్లక్ష్యంపై ఐటిడిఏ పిఓ, డిడి తక్షణమే స్పందించే చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు