బుగ్గవాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం
త్వరితగతిన పనులు ప్రారంభించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు పురపాలక(Illandu Municipality) పరిధిలోని 3, 4, 5 వార్డుల గుండా ప్రవహిస్తున్న బుగ్గవాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్(Buggavagu Retaining Wall) నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Kanam Kanakaiah) ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్మాణ పనులు చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
పనులను త్వరితగతిన ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బోళ్ల సూర్యం, మూడో వార్డు కౌన్సిలర్ అజ్మీర వంశీ, కోఆప్షన్ సభ్యుడు మడుగు సాంబమూర్తి, నాయకులు రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ సందీప్, ఏఈ రాజు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.