ఎదుగుదలకు చదువు ఒక్కటే మార్గం

07-11-2026 | 07:37pm

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, నాణ్యమైన శిక్షణ అందిస్తే ఉన్నత ఫలితాలు సాధిస్తారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘చదువుకో తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా టాపర్ ఆరాధ్యకు రూ.2 లక్షలు, నియోజకవర్గ టాపర్లు నిశిత, సాన్వీలకు చెరో రూ.లక్ష, మండల స్థాయి టాపర్లకు రూ.10 వేల చొప్పున అందజేశారు.

651వ ఉర్సు షరీఫ్ గోడపత్రిక ఆవిష్కరణ

 పిల్లలమర్రిలోని హజ్రత్ ఖుతుబుల్ అక్తాబ్ సయ్యద్ షా జమాల్ హుస్సేనీ చిష్తీ, కమాల్ హుస్సేనీ చిష్తీ వారి 651వ ఉర్సు షరీఫ్ గోడపత్రికను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. నవంబర్ 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో పీఠాధిపతి ఖాజాఖాన్, కాంగ్రెస్ నాయకులు, మతపెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు