వెలమ కార్పొరేషన్ చైర్మన్కు శ్రీహరిరావు శుభాకాంక్షలు
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జువ్వాడి నర్సింగరావు(Juvvadi Narsing Rao)ను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు(Congress Leader Kuchadi Srihari Rao) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తరహాలో వెలమ కులానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. నూతన చైర్మన్ జువ్వాడి నర్సింగరావు నాయకత్వంలో వెలమ సామాజిక వర్గంలోని మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహకారం అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.