పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎస్పీ షర్మిల సమీక్ష
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం(Nirmal District Police Office) జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల(SP Dr. G. Janaki Sharmila) అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, సైబర్ వారియర్స్‌తో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్షించారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను త్వరగా దర్యాప్తు చేసి పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రతి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. అదేవిధంగా E-Petty కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఏ కేసును కూడా అనవసరంగా పెండింగ్‌లో ఉంచవద్దని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఉపేందర్ రెడ్డి, సీఐలు కృష్ణ, మల్లేష్, ఎస్సైలు లింబాద్రి, అశోక్, ముత్యం, మహిళా ఎస్సై శ్రావణితో పాటు డీసీఆర్‌బీ, ఐటీ కోర్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.