విద్య , వైద్యం కు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

10-11-2026 | 06:21pm

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ

సుల్తానాబాద్, ఎలిగేడు  నవంబర్ 10 (విజయక్రాంతి): విద్యా , వైద్యం(Education, Healthcare)కు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ(MP Vamshikrishna) అన్నారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ(MP Vamshikrishna)  సుల్తాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలను(Sultanpur Government School) సందర్శించారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఎంపీ వారి చదువులు, పాఠశాలలోని సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇటీవల జిల్లా స్థాయిలోనిర్వహించిన తెలుగు వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని సాయి విజ్ఞతకు సైకిల్ బహుమతిగా అందజేస్తాననిప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాకా హయాంలో ఈ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించడం సంతోషంగా ఉందని, పాఠశాలకు రాగానే కాకా పేరును గుర్తుచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాల సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేస్తానని, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని కాకా ఎప్పుడూ చెప్పేవారని గుర్తుచేశారు. ఒకప్పుడు 11 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 90 మంది విద్యార్థులు చదువుతున్నారంటే ఉపాధ్యాయుల కృషి, అంకితభావం అభినందనీయమన్నారు. విద్యార్థులను ఎలక్ట్రిక్ ఆటోలో పాఠశాలకు తీసుకురావడం, తిరిగి ఇళ్లకు చేర్చడం చూస్తుంటే ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.

విద్యారంగంలో పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలిపి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించేలా కృషి చేయాలనిపిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతోందని తెలిపారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల్లోసృజనాత్మకతను ప్రోత్సహించేందుకు కాకా గ్రోత్ ఫండ్‌ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు, స్టార్టప్ ఐడియాలతో ముందుకు వచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలనుఅధిరోహించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకాంక్షించారు... ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట ఎండి సజ్జత్ , ప్రజా ప్రతినిధులు, నాయకులు పాఠశాలఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు...

మరిన్ని వార్తలు