ఆశ వర్కర్లకు 18 వేల రూపాయలు వేతనం ఇవ్వాలి..

10-11-2026 | 06:20pm

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు వినతిపత్రం సమర్పించిన ఆశ వర్కర్లు..

సుల్తానాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ఆశ వర్కర్ల కు 18 వేల రూపాయల ఫిక్స్ వేతనం నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆశ వర్కర్లు  మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chintakunta Vijaya Ramanarao)కు వినతి పత్రం సమర్పించారు.

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అన్నారు, ఆశా కార్యకర్తలకు 50 లక్షల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు చెల్లించాలని, ప్రతి ఆదివారం పండుగలకు సంవత్సరానికి 20 రోజులు క్యాజువల్, ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని వీటితో పాటు పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.

అలాగే నిరుపేదలైన తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఆశ వర్కర్లు ఎమ్మెల్యే ను కోరగా మీ అందరి పేర్లు ఇవ్వండి త్వరలోనే మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు, ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 15న సమ్మెకు పోవడం జరుగుతుందని వారన్నారు, ఈ కార్యక్రమం లో ఆశా వర్కర్ లు జిల్లా అధ్యక్షురాలు అన్నవేని స్వరూప, ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ , పర్ష మణింద్ర , జ్యోతి, పద్మ , సరిత , కళావతి, రేణుక, సరోజన, స్వప్న, రాజేశ్వరితో పాటు పెద్ద ఎత్తున ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు