తాడువాయి సమస్యలను వెంటనే పరిష్కరించాలి

10-11-2026 | 06:19pm

తాడ్వాయి,నవంబర్,10( విజయక్రాంతి ): తాడువాయి మండలంలోని(Taduvai Mandal) సమస్యలను వెంటనే పరిష్కరించాలని తాడ్వాయి మండలానికి  చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు(Congress party leader, MLA K. Madan Mohan Rao) ను కోరారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం హైదరాబాదులో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తాడ్వాయిలో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.

అదేవిధంగా సదాశివ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తాడ్వాయి మండలానికే ఇవ్వాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు,దేమికలాన్ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ రనిల్ రెడ్డి, నాయకులు మద్ది మహేందర్ రెడ్డి,అంబీర్ శ్యాం రావు,పైడి రాజేశ్వర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,మేకల రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు