ఆలేరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసినఅదనపు ఎస్పీ

12-11-2026 | 11:18pm

పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి

ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ చెబ్రోలు లక్ష్మీనారాయణ(Additional SP Chebrolu Laxminarayana) ఆలేరు పోలీస్ స్టేషన్‌(Alair Police Station)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ శాఖలో అమలవుతున్న వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను ఓపికగా విని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయాలని, నేరాల నియంత్రణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ తనిఖీలో యాదాద్రి డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్, ఆలేరు ఎస్‌హెచ్‌ఓ ఉదయ్, ఎస్‌ఐ వినయ్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు