నేరాల కట్టడిలో సీసీ కెమెరాల ది కీలక పాత్ర
ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
తొర్నాల గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట రూరల్: నేరాల కట్టడిలో సీసీ కెమెరాల(CC Cameras) ది కీలక పాత్ర అని, ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) అన్నారు. గురువారం సిద్దిపేట రూరల్ మండలం తొర్నాల గ్రామం(Thronala Village)లో గ్రామ సర్పంచ్ అర్వపల్లి పద్మాదేవి గోపీనాథ్ రెడ్డి, ఉప సర్పంచ్ శీలం ప్రవీణ్ లతో కలిసి సీసీ కెమెరాల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలను కట్టడి చేసేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.
అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా శాంతిభద్రతలను పరిరక్షించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నల్ల నరేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బట్టు భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఎర్ర యాదయ్య, వైస్ ఎంపీపీ శేరుపల్లి యాదగిరి, నాయకులు చందర్ రావు, తౌటి తిరుపతి, అన్నసారం పరమేశ్వర్ గౌడ్ ,ప్రభాకర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.