నటుడు ధ్రువ బాదిమికి ఘన సన్మానం
‘పండుగ సాయన్న’ నాటక ప్రదర్శనపై రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం ప్రశంసలు
జడ్చర్ల: రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం(State Fakir Welfare Association) ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు ధ్రువ బాదిమి(Actor Dhruva Badimini)ని ఘనంగా సన్మానించారు. ‘పండుగ సాయన్న’ జీవిత చరిత్రను నాటకం రూపంలో ప్రదర్శిస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను నేటి తరానికి తెలియజేయడం అభినందనీయమని సంఘం ప్రతినిధులు కొనియాడారు.
పండుగ సాయన్న చరిత్రను ప్రజలకు చేరువ చేయడం సంతోషకరమని పేర్కొంటూ, త్వరలో జడ్చర్ల నియోజకవర్గంలో కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించాలని ధ్రువ బాదిమిని కోరారు.ఈ కార్యక్రమంలో జహంగీర్ షా, మౌలాలి షా, ఖాజా షా, ఫకీర్ హుస్సేన్ షా, షఫియుద్దీన్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.