సిర్పూర్-కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు

12-11-2026 | 11:32pm

రైల్వే డీఆర్ఎం  గోపాల కృష్ణన్ 

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్(Kaghaznagar Railway Station) అభివృద్ధి కోసం కేంద్ర రైల్వే శాఖ రూ.36 కోట్లు మంజూరు చేసినట్లు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం డాక్టర్ గోపాలకృష్ణన్(Secunderabad South Central Railway DRM Dr. Gopalakrishnan) తెలిపారు. గురువారం సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు.

రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అందిస్తున్న  సేవలు, సౌకర్యాలు, ఇతర అంశాలపై  రైల్వే అధికారులతో చర్చించారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు  రైల్వే డి ఆర్ ఎం కు  రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. స్థానికులకు సౌకర్యం కోసం 2,3 ప్లాట్ ఫామ్ ల అభివృద్ధి, లిఫ్ట్ సౌకర్యం, ఎక్సలేటర్ ఏర్పాటు చేయాలని డి ఆర్ ఎం  గోపాలకృష్ణన్ కోరారు.

మరిన్ని వార్తలు