ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో రెండు పోలింగ్ కేంద్రాలు

10-11-2026 | 06:05pm

అఖిలపక్ష తీర్మానం.. తహసీల్దార్‌కు వినతి

బూర్గంపాడు, (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బూర్గంపాడులో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ కేఆర్‌కే ప్రసాద్‌(Tahsildar KRK Prasad) ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో రెండు ఏర్పాటు చేయాలని నాయకులు తీర్మానించారు.

ఈ మేరకు సంతకాలతో కూడిన తీర్మాన పత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. దీనిని ఉన్నతాధికారులకు పంపించి పోలింగ్ కేంద్రాల పెంపునకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్‌ ధనియాల వెంకటేశ్వర్లుతో పాటు బీఆర్ఎస్‌, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు