క్రైస్తవుల విశ్వాసంపై దాడిని ఖండించిన పాస్టర్స్ ఫెలోషిప్

04-11-2026 | 11:55pm

మహబూబ్‌నగర్, నవంబర్ 4 (విజయక్రాంతి): క్రైస్తవ యువతి అరుణజ్యోతిపై దాడి ఘటనను మహబూబ్‌నగర్ పాస్టర్స్ ఫెలోషిప్(Mahabubnagar Pastors Fellowship) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ ప్యాట్రన్ రెవ. డాక్టర్ ఎస్. వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మత విశ్వాసాలను గౌరవించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 10న ఎంబీ చర్చి నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించే ర్యాలీలో క్రైస్తవులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బి.ఐ. జాకబ్, జె.ఐ. డేవిడ్, టి.ఎ. స్టీఫెన్, దాసరి శామ్యూల్ ప్రభాకర్, కాశపోగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు