మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..

04-11-2026 | 11:57pm

టీఎస్ యుటిఎఫ్ 

కొడిమ్యాల, నవంబర్ 4 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు తిరుక్కోవేల శ్యాంసుందర్(TSUTF President Tirukkoveela Shyamsunder) మాట్లాడుతూ... మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలు 010 పద్దు కింద ఉపాధ్యాయుల వేతనాలు మంజూరు చేయాలి,సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ డీఏ బకాయిలను విడుదల చేయాలి,టీజీటీ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి, జిఓ 317 వర్తింపజేయాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలని, పిఆర్సిని నివేదిక బహిర్గతం చేసి పిఆర్సిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అంబటి భూమేశ్వర్,ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ వేముల శ్రీనివాస్,మండల అధ్యక్షులు నిషాని మహేందర్,ప్రధాన కార్యదర్శి కొత్తూరి నాగ రాజు, మోడల్ స్కూల్ ఐక్య వేదిక నాయకులు, ఎంఎస్టిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్,ఉపాధ్యక్షులు రాజేశం, మల్లేశం,కార్యదర్శి శిరీషా,శరణ్య, ప్రమోద, టిజిటి విభాగం బాధ్యులు శ్రీధర్,రోహిణి,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు