ఆ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. ‘జై హనుమాన్’లో ఛాన్స్!
హైదరాబాద్: ‘ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఆడియన్స్(Audience)కి దగ్గరైన మమితా బైజుకు ఇప్పుడు అదిరిపోయే ఛాన్స్ దక్కింది. స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో ఈ బ్యూటీ పేరు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ(Talk of the Industry)గా మారింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా తెరకెక్కుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమాకు మరో క్రేజీ ఎలిమెంట్(Element)గా రానా దగ్గుబాటి కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. మొత్తానికి.. ‘ప్రేమలు’తో మెప్పించిన మమితా బైజు, ఇప్పుడు ‘జై హనుమాన్’తో పాన్ ఇండియా(Pan India) స్థాయిలో మరింత గట్టిగా సౌండ్ చేయడానికి రెడీ అవుతోంది!