విద్యార్థిని పరిమర్శించిన మాజీ ఎమ్మెల్యే అలా

07-10-2026 | 05:17pm

మూసాపేట్/అక్టోబర్ 7: మూసాపేట్ మండల పరిధిలోని నిజాలపూర్ గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు కుమార్తె 8 సంవత్సరాల శ్రావణి పాముకాటుకు గురై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుండగా విషయం తెలుసుకున్న దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Alla Venkateshwar Reddy) బుధవారం శ్రావణిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

అలాగే ఇంకో కూతురు లావణ్య పాము కాటుకు గురై మృతి చెందడంతో మృతిపట్ల గొల్ల శ్రీను కుటుంబ సభ్యులకు ఆల వెంకటేశ్వర్ రెడ్డి  ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.అలాగే, చికిత్స పొందుతున్న శ్రావణి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరిమర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఇంద్రయ్య సాగర్, శ్రీనివాస్ సాగర్ లు ఉన్నారు.

మరిన్ని వార్తలు