అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో పాదయాత్ర

07-10-2026 | 05:20pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 07 ( విజయక్రాంతి ) : ఇండియా కూటమి(INDIA Alliance) ఆధ్వర్యంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐ (ఎంఎల్) పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ గురువారం  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కిరణ్, సీపీఎం జిల్లా నాయకులు ఆకుదారి రమేష్ లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కును పరిరక్షించాలని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఫార్మ్ 6 లో తీసుకొచ్చిన మార్పులపై స్పష్టత ఇవ్వాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాట్ల శ్రీనివాస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు