ఇన్‌స్టామార్ట్‌లో ధంతేరాస్ వేళ బంగారు నాణేలు

05-11-2026 | 09:05pm

ముంబై: ధంతేరాస్ కు ముందు, భారతదేశంలో మార్గదర్శక క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టామార్ట్(Instamart), తన విక్రేతల ద్వారా కల్యాణ్ జ్యువెలర్స్‌(Kalyan Jewellers)తో భాగస్వామ్యం కుదుర్చుకుని, ఆ సంస్థకు చెందిన బంగారు నాణేల కలెక్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కలెక్షన్‌లో 0.1 గ్రాము బరువున్న బంగారు నాణేలు కూడా ఉన్నాయి. దీంతో వినియోగదారులకు బంగారం కొనుగోలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు, ఈ పండుగ సందర్భాన్ని ఒక విలువైన కొనుగోలుతో గుర్తుండిపోయేలా చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఇన్‌స్టామార్ట్‌లో కల్యాణ్ జ్యువెలర్స్ బంగారు నాణేలను కొనుగోలు చేసే వినియోగదారులు అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. నవంబర్ 1 నుంచి 6 వరకు, ప్రతిరోజూ దేశవ్యాప్తంగా ఇన్‌స్టామార్ట్‌లో కల్యాణ్ జ్యువెలర్స్ బంగారు నాణెం* కొనుగోలు చేసే తొలి 1,000 మంది వినియోగదారులకు ఉచితంగా 1 గ్రాము వెండి నాణెం అందించబడుతుంది. అంతేకాకుండా, కల్యాణ్ జ్యువెలర్స్‌కు చెందిన ప్రతి బంగారు నాణెం కొనుగోలుపై 5 గ్రాముల వెండి నాణెం విలువకు సమానమైన ఉచిత డిజిటల్ డిస్కౌంట్ వోచర్‌ను కూడా వినియోగదారులు పొందుతారు. *నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న కల్యాణ్ జ్యువెలర్స్ స్టోర్లలో ఈ వోచర్‌ను రిడీమ్ చేసుకోవచ్చు. 

ఈ భాగస్వామ్యం ద్వారా  ధంతేరాస్ కు ముందు విలువైన లోహాలను సౌకర్యవంతంగా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీపావళి వేడుకల్లో మొదటి రోజైన ధన్తేరస్ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఐశ్వర్యం, శుభఫలితాలను తీసుకొస్తుందని నమ్ముతారు. పండుగ సీజన్‌కు ముందు ఇన్‌స్టామార్ట్‌లో 0.5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు బరువున్న బంగారు నాణేలు, 1 గ్రాము నుంచి 100 గ్రాముల వరకు బరువున్న వెండి నాణేలు విస్తృత శ్రేణిలో అందుబాటులో ఉంటాయి.

మరిన్ని వార్తలు