మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు
05-11-2026 | 08:29pm
మల్లాపూర్, నవంబర్ 05 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి(Gundampalli village) చెందిన ఇటీవల మృతి చెందిన హోటల్ మల్లయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మా నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.