సంచార ముస్లింల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

05-11-2026 | 08:33pm

కొత్తపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం(Nomadic Muslim communities) (BC-E 1-14) ఆధ్వర్యంలో గురువారం రోజున కరీంనగర్ కలెక్టరెట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి(District General Secretary of the All India Forward Bloc) బండారి శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సంచార ముస్లిం తెగల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర వెనుకబాటుతనంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజంలో అందరితో పాటు వీరికి కూడా సమాన అవకాశాలు కల్పించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వంత ఇండ్లు లేని వారికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని లేదా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరి ప్రధాన డిమాండ్లు అయిన సంచార ముస్లింల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

నవంబర్ 11న అబ్దుల్ కలాం ఆజాద్ జయంతికి ముందే 'తౌఫా-యే-తాలీమ్' పథకాన్ని ప్రారంభించాలని, కులవృత్తులు కోల్పోయిన సంచార ముస్లింల ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఏడాదికి రూ. 1,000 కోట్లు కేటాయించాలనీ, అటవీ చట్టాల కారణంగా వృత్తులు కోల్పోయిన గారడీ ముస్లింలు, పాముల సాయబులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలనీ,ఉపాధి కోల్పోయిన వారికి రూ. 10 లక్షల వరకు 100% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని, సంచార ముస్లింల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం స్థలం మరియు నిధులు కేటాయించాలి.

'నాయి ముస్లింలు' స్వేచ్ఛగా తమ వృత్తిని చేసుకునే అవకాశం కల్పించాలనీ,తరతరాలుగా వస్తున్న 'తుర్కాకాశల' వృత్తి కొనసాగేలా గుట్టలు మరియు సంబంధిత ప్రాంతాలపై హక్కులు కల్పించాలనీ, ప్రమాదకరమైన 'తుర్కాకాశ' మరియు 'అచ్చుకట్ల' వృత్తులలో (అల్యూమినియం, రాగి కరిగించే క్రమంలో) గాయపడిన, అంగవైకల్యం పొందిన లేదా మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక పరిహారం మరియు వైద్య సహాయం అందించాలి. బోరెవాలే, బొంతే వాలే, అత్తరు సాయబు, అచ్చుకణ వృత్తుల ఆధునీకరణకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు