అయ్యప్ప భక్తులకు కొనసాగుతున్న అన్నదానం
05-11-2026 | 08:45pm
కోదాడ నవంబర్ 05(విజయ క్రాంతి): అనంతగిరిలో అయ్యప్ప సన్నిధిలో ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ(Distribution of sanctified food (Annaprasada)) 30,వ రోజు గురువారం సుమారుగా 1000 మంది స్వాములు అన్నప్రసాదం స్వీకరించినారు, దాతలుగా మహారాజపోశకులు బుర్రా పుల్లారెడ్డి - సుధారాణి దంపతులు, బుర్రా ప్రమోద్ రెడ్డి దంపతులు, పసుమర్తి హరిప్రకాష్ - ప్రత్యుష దంపతులు వ్యవహారించినారు.. కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు , పందిరి వీరయ్య ,కుక్కడపు గోపాలకృష్ణ, నలజాల రామకృష్ణ, వెంగల వీరబాబు, మార్తి వేణు, నూకపంగు బాలకృష్ణ మాలధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు..