మిడ్జిల్ డిజిటల్ మీడియా యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
మిడ్జిల్: జడ్చర్ల నియోజకవర్గం(Jadcherla constituency)లోని మిడ్జిల్ మండల డిజిటల్ మీడియా యూనియన్(Midjil Digital Media Union) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ డిజిటల్ మీడియా యూనియన్ అధ్యక్షుడు మక్సూద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా సౌట రమేష్ గౌడ్ మెట్రో న్యూస్, ఉపాధ్యక్షుడిగా ఆందోజు ఆచారి తొలి ఆకాంక్ష, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు ఆంజనేయులు విజయక్రాంతి సహాయ కార్యదర్శిగా షేక్ సలీం జనం స్ఫూర్తి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు బరిగెల రాము తొలి ఆకాంక్ష, తిర్మన్ దాస్ సతీష్ గౌడ్ టీఎస్ న్యూస్, పల్లె శ్రీను పద్మక్రాంతి, మీ ఆడ్స్ మహేష్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.