వృధా పారుతున్న నీటిని అరికట్టిన అధికారులు
నాగిరెడ్డిపేట్,నవంబర్ 5 (విజయ క్రాంతి):ఎలినో ప్రభావంతో నీటి కొరత ఏర్పాటుతుందని ముందస్తు జాగ్రత్తతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆదేశించారు. అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదని మండలంలోని పోచారం గ్రామంలో త్రాగునీరు మురికి కాలువల ద్వారా వృధాగా పారుతుందని విజయక్రాంతి దినపత్రికలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు.
స్పందించి సంఘటన స్థలానికి గ్రామ సర్పంచ్ సంజీవరావు,ఎంపిఓ ప్రభాకర్ చారి,కార్యదర్శి అశోక్ వెళ్లి పరిశీలించి పోచారం గ్రామంలో వృధాగా మురికి కాలువ ద్వారా పారుతున్న త్రాగునీటిని అరికట్టారు.దీనితో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఎందుకంటే రానున్న రోజుల్లో గట్టు కాలం రావచ్చని అనే ఉద్దేశంతో త్రాగునీరు మురికి కాలువ పలు కాకుండా ఉండేందుకు విజయక్రాంతి దినపత్రిక కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టారు.
మండలంలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.పోచారం గ్రామస్తులు అవసరాల మేరకు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే నీటిని వదులుతామని పంచాయతీ కార్యదర్శి అశోక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ ప్రభాకర్ చారి,గ్రామ సర్పంచ్ సంజీవరావు పంచాయతీ కార్యదర్శి అశోక్,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.