హైదరాబాద్‌లో యు.ఎస్. పోలో కొత్త స్టోర్ ప్రారంభం
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ క్యాజువల్ వేర్ బ్రాండ్, యునైటెడ్ స్టేట్స్ పోలో అసోసియేషన్ (యూఎస్‌పీఏ) అధికారిక క్రీడా బ్రాండ్ అయిన యు.ఎస్. పోలో అసోసియేషన్ (U.S. Polo Assn), హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తమ కొత్త ఐడెంటిటీ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా దక్షిణ భారతదేశంలో తమ వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తృతం చేసుకుంటోంది. సుమారు 2,105 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ద్వారా బ్రాండ్ తమ తాజా రిటైల్ డిజైన్ శైలిని, మెరుగైన స్టోర్ అనుభవాన్ని పరిచయం చేస్తోంది.
ఈ కొత్త స్టోర్ ప్రారంభోత్సవానికి నటుడు అఖిల్ అక్కినేని(Actor Akhil Akkineni) హాజరు కావటంతో పాటుగా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమం ద్వారా యు.ఎస్. పోలో అసోసియేషన్ యొక్క కొత్త రిటైల్ ఫార్మాట్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. స్టోర్లలో వినియోగదారులకు అందించే అనుభవాల విషయంలో బ్రాండ్ అనుసరిస్తున్న విధానాన్ని, హైదరాబాద్‌లో తన విస్తరణను కొనసాగిస్తున్న తీరును ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.
హిమాయత్‌నగర్‌లో ఉన్న ఈ కొత్త స్టోర్‌లో పురుషుల దుస్తులు, పాదరక్షలు, పిల్లల దుస్తులకు సంబంధించిన ఎంపిక చేసిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. వీటిలో బ్రాండ్ 2026 ఆటం- వింటర్ కలెక్షన్‌కు చెందిన పాచో, వర్సిటీ, ఇండిగో, కార్డురాయ్, డెనిమ్స్, షర్ట్స్ వంటి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.
ఈ కొత్త రిటైల్ స్టోర్ లో ప్రధాన ఆకర్షణగా షర్ట్ బార్ నిలుస్తుంది. వివిధ రకాల షర్ట్‌లను ఒకే ప్రత్యేక విభాగంలో అందుబాటులోకి తీసుకురావడానికి యు.ఎస్. పోలో అసోసియేషన్ ఈ ప్రత్యేక కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో షర్ట్‌లకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. ఈ విభాగం ద్వారా వినియోగదారులు షర్ట్‌ల విభాగాన్ని మరింత ఆసక్తికరంగా పరిశీలించే అవకాశం కలుగుతుంది. అలాగే వివిధ సందర్భాలకు, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా షర్ట్‌లను ఎలా ధరించవచ్చో ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఈ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా యు.ఎస్. పోలో అసోసియేషన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ సూరి మాట్లాడుతూ, ‘‘యు.ఎస్. పోలో అసోసియేషన్‌కు హైదరాబాద్ ఒక ముఖ్యమైన మార్కెట్. హిమాయత్‌నగర్‌లో మా కొత్త ఐడెంటిటీ స్టోర్ ను ప్రారంభించటం, నగరంలో మా కార్యకలాపాలను మరింత విస్తృతం చేసుకునే దిశగా వేసిన మరో ముఖ్యమైన ముందడుగు. స్టోర్ ప్రారంభానికి లభించిన స్పందన ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ఈ కొత్త స్టోర్, భారతదేశంలో యు.ఎస్. పోలో అసోసియేషన్ యొక్క పెరుగుతున్న రిటైల్ విస్తరణకు మరింతగా తోడ్పడనుంది.