క్లాసిక్ లుక్.. ఆధునిక టెక్నాలజీ

16-11-2026 | 05:20pm

ముంబయి: జావా యెజ్డీ, బీఎస్ఏ మోటార్ సైకిల్స్(Jawa Yezdi and BSA Motorcycles) భారతదేశంలో అత్యంత కొత్త మోటార్ సైకిల్ కంపెనీలలో ఒకటి. వరుసగా మూడవసారి ఈఐసీఎంఏ 2026లో తమ అంతర్జాతీయ పోర్ట్ ఫోలియో యొక్క తదుపరి దశను సమర్పించాయి. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న థండర్ బోల్ట్  350 మరియు బీఎస్ఏశ్రేణి అంతటా  రెండు కొత్త రంగులతో పాటు రెండు కొత్త బీఎస్ఏ 350cc మోటార్ సైకిల్స్ ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి విడుదల చేయబడ్డాయి.

మార్కెట్లలో కొత్త రైడర్ల వద్దకు తమ ఆధునిక క్లాసిక్స్ ను తీసుకువెళ్తున్న భారతదేశపు తయారీదారు యొక్క పెరుగుతున్న అంతర్జాతీయ ఉనికిని తెలియచేస్తోంది. దేశీయ మార్కెట్ లో బీఎస్ఎ యొక్క పురోగతి కంపెనీ యొక్క లక్ష్యాలకు కీలకమైన సూచనదారు. 1861లో బర్మింఘామ్ లో స్థాపించబడిన బీఎస్ఎ మరొకసారి యూకేలో తమ ఉనికిని స్థాపించింది. 2025లో ప్రారంభించబడిన బీఎస్ఎ బాంటమ్ 350 యూకే యొక్క నెలవారీ ఆధునిక క్లాసిక్ అమ్మకాల చార్ట్స్ లో తరచూ అగ్రస్థానంలో నిలుస్తోంది. భారతదేశంలో తయారైన మోటార్ సైకిల్ తో ఒక బ్రిటీషు బ్రాండ్ తన సొంత మార్కెట్ లోకి తిరిగి రావడం ఒక  గొప్ప విజయం.

క్లాసిక్ లెజెండ్స్ కో ఫౌండర్ అనుపమ్ థరేజా మాట్లాడుతూ “ మేము భారతదేశం నుండి అంతర్జాతీయ మోటార్ సైకిల్ కంపెనీని రూపొందిస్తున్నాం, అంటే మేము ప్రవేశించే ప్రతి మార్కెట్ లో రైడర్స్ కు అనువుగా ఉంటూనే తమ బ్రాండ్స్ కు ప్రామాణికమైన మోటార్ సైకిల్స్ ను సృష్టించడం అని అర్థం. హెరిటేజ్ మాకు గట్టి పునాదిని ఇచ్చింది కానీ ఉత్పత్తి మరియు యాజమాని అనుభవం ఆ వాగ్థానంపై తప్పనిసరిగా అందచేయబడాలన్నారు. UKకి బీఎస్ఏ వాపసు రావడం ప్రత్యేకించి అర్థవంతమైనది.

అభివృద్ధి చెందిన మార్కెట్లు కేవలం పెద్ద- డిస్ ప్లేస్మెంట్ మోటార్ సైకిళ్లలో మాత్రమే ఆసక్తిని కలిగి ఉంటాయని చాలామంది విశ్వసించిన సమయంలో, మేము బాంటమ్ 350ని పరిచయం చేసాము. అందుబాటులో ఉండే ఆధునిక క్లాసిక్ కోసం శక్తివంతమైన మార్కెట్ ఉందని నిరూపించాము. 

రైడర్స్ కేవలం BSA పేరు కోసం మాత్రమే కాకుండా నేడు మోటార్ సైకిల్ అందిస్తున్న అంశం కోసం కూడా ఎంచుకుంటున్నారని  UKలో దీని  పెర్ఫార్మెన్స్ చూపించింది. ఈఐసీఎంఏ 2026లో మేము బాంటమ్ కుటుంబాన్ని బాబర్ మరియు స్క్రాంబ్లర్ కుటుంబంతో విస్తరించడం ద్వారా  తదుపరి చర్య తీసుకున్నాము. ఈ రెండు విభిన్నమైన మోటార్ సైకిల్స్, వివిధ రైడర్స్ కోసం సృష్టించబడ్డాయి కానీ రెండూ కూడా  బీఎస్ఏ యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి మరియు మోటార్ సైక్లింగ్ యొక్క ఆనందాన్ని  మరింత అందుబాటులో ఉంచాయి.

మరిన్ని వార్తలు