ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

16-11-2026 | 05:13pm

ఎం పి డి ఓ వి ప్రవీణ్ కుమార్

వెంకటాపురం నూగూరు, నవంబర్ 16 ,(విజయక్రాంతి): ప్రజావాణిలో(Prajavani) వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఎంపీడీవో మీ ప్రవీణ్ కుమార్(MPDO M. Praveen Kumar) అధికారులను ఆదేశించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వృద్ధాప్య పింఛన్,, ఉపాధి, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, వ్యవసాయ భూములకు , విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు వినతులు అందజేశారు.

పిల్లల ప్రజావాణిలో పాఠశాలలకు నూతన భవనం, తాగునీరు, వంటశాల, రహదారులు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. అందిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,  దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు