ప్రారంభమైన పోలీస్ బ్యాండ్ పోటీలు
సికింద్రాబాద్: పోలీసుల కవాతులో సంగీత స్వరాలు మార్మోగనున్నాయి. 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు(27th All India Police Band Competition) సోమవారం సికింద్రాబాద్లోని హకీంపేట్ సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్(Hakimpet CRPF Group Centre)లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(Telangana DGP CV Anand) ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 21 బ్యాండ్ బృందాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. సుమారు 1,400 మంది పోలీసు సిబ్బంది తమ సంగీత ప్రతిభను ప్రదర్శించనున్నారు.
బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ పోలీస్ బ్యాండ్లు క్రమశిక్షణ, ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీకలని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు వివిధ రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. నవంబర్ 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు ఈ జాతీయ స్థాయి పోటీలు కొనసాగనున్నాయి. ప్రజలు కూడా పోలీసు బ్యాండ్ల సంగీత ప్రదర్శనలను వీక్షించేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.