ఎన్నికలపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలి
జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్. ప్రసునాంబ
జగిత్యాల, నవంబర్ 16 ( విజయ క్రాంతి ): ప్రతి విద్యార్థికి ఎన్నికలపై, ఓటర్ల జాబితా(Voter List) పై అవగాహన ఉండాలని జిల్లా ఎడిషన్ కలెక్టర్ ప్రసూనాంబ(District Additional Collector Prasunamba) తెలిపారు. ఈరోజు స్థానిక ఓల్డ్ హై స్కూల్ లో ఎలెక్టోరల్ లిటరసీ క్లబ్ ల జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఓటు హక్కు ప్రజాస్వామ్యం పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి రమేష్, మండల విద్యాధికారి చంద్రకళ, జగిత్యాల అర్బన్, రూరల్ తహసిల్దారులు రామ్మోహన్, హకీమ్, పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినిపెల్లి ఆనంద్ రావు, కార్యక్రమ నిర్వాహకులు రాజశేఖర్, శివ ప్రసాద్, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.