భూభారతి రి సర్వే పై అవగాహన సదస్సు

16-11-2026 | 05:05pm

నిజాంసాగర్ నవంబర్ 16( విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల సర్వే కార్యక్రమంలో(Bhu-Bharati Land Survey Program) భాగంగా  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మంగుళూర్, నర్సింగ్రావుపల్లి గ్రామాలలో భూ భారతి రీసర్వే గ్రామసభ  తాసిల్దార్ భుజంగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భూ భారతి రీసర్వే కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పించారు.ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాన్ని సజావుగా, విజయవంతంగా అమలు చేయడానికి రైతులు తమ పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.

కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ నర్మల రాజు,సర్వే శాఖ అధికారులు, కామారెడ్డి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, సర్వేయర్, లైసెన్స్‌డ్ సర్వేయర్లు,  ఇరిగేషన్ఏ ఈ అక్షయ్అటవీ శాఖ అధికారులు,  రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు