ధర్మశాల జాతీయ స్థాయి ఎన్ఎస్ఎస్ అడ్వెంచర్ క్యాంప్‌

16-11-2026 | 05:21pm

కళాశాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థి.. అభినందించిన ప్రిన్సిపల్, అధ్యాపక బృందం

ఆలేరు, నవంబర్ 16 (విజయక్రాంతి): భువనగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు(Sri Lakshmi Narasimha Swamy Degree and PG College) చెందిన బీకామ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి, ఎన్ఎస్ఎస్ యూనిట్-1 వాలంటీర్(NSS Unit-1 Volunteer) ఈ. అజయ్ జాతీయ స్థాయి ఎన్ఎస్ఎస్ అడ్వెంచర్ క్యాంప్‌కు ఎంపికయ్యారు.

ఈ నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక శిబిరంలో ఆయన పాల్గొననున్నారు. జాతీయ స్థాయి శిబిరానికి అజయ్ ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్. శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. రమేష్, ఎన్ఎస్ఎస్ యూనిట్-1 ప్రోగ్రాం అధికారి తోటకూరి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అజయ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయన ఎంపిక కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులు ఇలాంటి జాతీయ స్థాయి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ప్రోగ్రాం అధికారి కె. బాలరాజు, యూనిట్-3 ప్రోగ్రాం అధికారి ఎండీ అత్తర్ ఫరీన్‌తో పాటు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అజయ్‌కు అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు