ట్రావెల్ హంగామా సేల్
ప్రారంభించిన సదరన్ ట్రావెల్స్
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): దేశీయ, అంతర్జాతీయ పర్యాటక(Domestic and international tourism) గమ్యస్థానాలకు ఆకర్షణీయమైన ఆఫర్లతో సదరన్ ట్రావెల్స్(Southern Travels) వార్షిక ‘ట్రావెల్ హంగామా సేల్(Travel Hungama Sale)' ప్రారంభించింది. న వంబర్ 25 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సేల్ ద్వారా 2026 సంవత్సరాంతపు సెలవులతో పాటు 2027 వేసవి విహారయాత్రలను ముందుగానే బుక్ చేసుకునే అవకా శం కల్పిస్తోంది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై ప్రత్యేక డిస్కౌంట్లు(Discounts) అందిస్తోంది.
కేవలం రూ.5 వేల టోకెన్ అమౌంట్తో దేశీయ టూర్ను, రూ.10 వేలతో అంతర్జాతీయ టూర్ను బ్లాక్ చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ప్రయోజనాలను డిసెంబర్ 2027 వరకు పొందవచ్చని సంస్థ తెలిపింది. యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, వియత్నాం, సింగపూర్, దుబాయ్, శ్రీలంక, అల్మాటీ, దక్షిణాఫ్రికా, కెన్యా తదితర అంతర్జాతీయ గమ్య స్థానాలకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
దేశీయంగా కాశ్మీర్(Kashmir), హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అమర్నాథ్, హరిద్వార్ అర్ధ కుంభ్, నాసిక్ మహా కుంభ్, కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్, అయోధ్య, వారణాసి, చార్ధామ్, ఉజ్జయిని మహాకాళేశ్వర్ తదితర ప్రాంతాలకు ప్యాకేజీలు అందిస్తోంది. సదరన్ ట్రావెల్స్ మేనే జింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ అలపాటి, జా యింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అలపాటి మాట్లాడుతూ ప్రత్యేక టూర్ ప్రణాళికలతో పాటు ‘ట్రావెల్ నౌ, పే లేటర్’ సదుపాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. www.southerntravels.com ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు.