తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే వృషకర్మ
నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా నటిస్తున్న సినిమా ‘వృషకర్మ(Vrushabha Karma)’. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై(Sukumar Writings Banners) బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ట్రైలర్ బుధవారం విడుదలైంది. 5 వేల ఏళ్ల క్రితం నాటి పురాతన, అతీంద్రియ శక్తి.. సాధారణ మానవుల ఆలోచనలకు అందని వేద విజ్ఞానం.. వంటి అంశాలతో అల్లుక్ను కథ ఇది అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సృష్టి ధర్మాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించిన దైవిక శక్తి ‘వృషకర్మ’గా కథానాయకుడు మారడం ఆసక్తిని పెంచుతోంది.
‘విరూపాక్ష’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ దండు ఈ సినిమాను మరింత భారీ స్థాయి కథతో తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య ట్రెజర్ హంటర్ పాత్రలో కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. మీనాక్షి చౌదరి, కియారా ఖన్నా, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించారు. స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా భయపెట్టనుండగా, సత్య కామెడీతో అలరించనున్నారు. రాగుల్ డీ హెరియన్ సినిమాటోగ్రఫీ, బీ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంటున్నాయి.
నెల్లూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. “కార్తీక్ చెప్పినప్పుడు వృషకర్మ’ కథకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. అంత ఒరిజినల్‌గా రాశారు. చాలా ఫ్రెష్ ఐడియా. ఎప్పుడూ చూడని విజువల్స్ ఇందులో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల గొప్ప డైరెక్టర్ల లిస్టులో కార్తీక్ చేరబోతున్నారు. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే చిత్రమిది. ప్రేక్షకులందరినీ తప్పకుండా అలరిస్తామని నమ్ముతున్నా” అన్నారు.
‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని మీనాక్షి చౌదరి తెలిపింది. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.. “20 ఏళ్ల క్రితం ఇక్కడే ‘ఛత్రపతి’ షూటింగ్ చేశాం. దానిలాగే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని చెప్పారు. ‘సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అని స్పర్ష్ శ్రీవాస్తవ చెప్పారు.