తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

26-11-2026 | 05:00am

ఒంగోలులో డిసెంబర్ 19, 20 తేదీల్లో సభలు

30 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు(Andhra Saraswata Parishattu) ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు (World Telugu Conference)సీఎం చంద్రబాబును(CM Chandrababu Naidu) పరిషత్తు అధ్యక్షుడు డా. గజల్ శ్రీనివాస్(Ghazal Srinivas) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో కలిసి ఆహ్వాన పత్రం అందజేసింది. డిసెంబర్ 19న ఉదయం 10.30 గంటలకు నెక్స్‌ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్(Next Gen International School) ప్రాంగణంలో జరిగే ప్రారం భోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు.

తెలుగు భాషా చరిత్రలో తొలి సారిగా 16 ఏళ్లలోపు బాలల కోసం, బాలల చేత నిర్వహిస్తున్న మహాసభలుగా వీటికి ప్ర త్యేకత ఉందని గజల్ శ్రీనివాస్ వివరించారు.  ప్రదర్శించనున్నట్లు తెలిపారు. నందమూరి తారక రా మారావు కళా ప్రాంగణంలో, టంగుటూరి ప్రకాశం పంతు లు ప్రధాన వేదికగా ఈ  సభలు జరగనున్నాయి. 

మహాసభల కు హాజరుకావాలన్న ఆహ్వా నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలం గా స్పందించినట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబుని కలిసిన వారిలో మహాసభల ముఖ్య సమన్వయకర్తలు డా. కె. మురళీధర్ రెడ్డి, కోగంటి శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ రెడ్క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. రామచంద్రరాజు ఉన్నారు.

మరిన్ని వార్తలు