రేవంత్ జలద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే సాక్ష్యం
తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీకి పెద్దపీట : మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీఎం కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే(KRMB meeting minutes) మరో సాక్ష్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో(KRMB Meeting) ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై(AP Palnadu Water Grid Project) రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం తెలంగాణకు శాపంగా పరిణమిస్తోందని మండిపడ్డారు.
చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదన్నారు. రేవంత్ రెడ్డి.. నాగార్జునసాగర్ జలాలను(Nagarjunasagar waters) తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రశ్నించలేదు?, ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదు?, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారు, నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడైనా..డైనా నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది, చేస్తున్నది కాంగ్రెసే అని విమర్శించారు.